![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -361 లో రామలక్ష్మి ఫోటోని రామ్ చూసి.. మా మిస్ లాగే ఉంది అందుకేనా సీతా ఎప్పుడు రామలక్ష్మి, రామలక్ష్మి అంటుంటాడని అక్కడున్న పేపర్ తీసి చదువుతాడు. అందులో సీతాకాంత్ తన భార్య రామలక్ష్మి పై ప్రేమ గురించి రాస్తాడు. అది చదివి మా మిస్ ని సీతా ని ఎలాగైనా ఒకటి చెయ్యాలని రామ్ అనుకుంటాడు.
మరొకవైపు ఆ రమ్య డబ్బు కోసం ఇదంతా చేస్తుంది.. ఆ విషయం నేను చెపుదామంటే నేనే రామలక్ష్మి అని తెలిసిపోతుంది. ఆ రమ్య బాబుని ఎలా చూసుకుంటుందోనని ఫణీంద్ర, సుశీల వాళ్ళతో రామలక్ష్మి అంటుంది.ఆ తర్వాత సీతాకాంత్ రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తుంటాడు. పెళ్లి కూతురు ఇంట్లోనే కదా ఉంది ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారని శ్రీవల్లి అడుగుతుంది. మైథిలీ గురించి అని సీతాకాంత్ అనగానే.. శ్రీవల్లి షాక్ అవుతుంది. సీతాకాంత్ రామలక్ష్మికి ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ కి వస్తున్నారా అని అడుగగా.. లేదని రామలక్ష్మి అంటుంది. మీరు తప్పకుండా రావాలని సీతాకాంత్ చెప్తాడు. మరొకవైపు ఎక్కడ రామలక్ష్మి ఎంగేజ్ మెంట్ ఆపుతుందోనని రమ్య టెన్షన్ పడుతుంది. అప్పుడే శ్రీవల్లి తన దగ్గరికి వచ్చి బావగారు ఆ మైథిలి కోసం వెయిట్ చేస్తున్నారని చెప్తుంది.
సీతాకి ఎంగేజ్ మెంట్ కి ఇష్టం లేకపోయిన ఏం జరిగిన ఎంగేజ్ మెంట్ జరిగేలా అంతా సెట్ చేసాం.. నీ ఎంగేజ్ మెంట్ జరుగుతుందని రమ్యకి శ్రీలత హామీ ఇస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మికి సీతాకాంత్ ఫోన్ చేస్తుంటాడు కానీ రామలక్ష్మి లిఫ్ట్ చెయ్యదు. రామలక్ష్మి రాకుంటే ఇప్పుడు ఈ ఎంగేజ్ మెంట్ ఎలా ఆపాలని సీతాకాంత్ అంటాడు. అప్పుడే పంతులు గారు వస్తారు. ఇంకా రావలసిన వాళ్ళున్నారు.. వచ్చాక మొదలు పెడుదామని సీతాకాంత్ అంటాడు. అప్పుడే మా మిస్ వచ్చింది అంటూ రామ్ వస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. రామలక్ష్మి తనంతట తానే బయటపడేలా సీతాకాంత్ బెహేవ్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |